21 May, 2026 | 3:52 PM

తూప్రాన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కార్ల కంటైనర్ లారీలో అగ్నిప్రమాదం

21-05-2026 02:38 PM

తూప్రాన్,(విజయక్రాంతి): నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కార్ల ట్రక్కు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన తూప్రాన్ భయార్ కంపెనీ ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన చోటుచేసుకుంది. నిజామాబాద్ వైపు నుండి ఒక భారీ ట్రక్కులో కార్లు హైదరాబాద్ కు తీసుకెళ్లే క్రమంలో తూప్రాన్ జాతీయ రహదారి 44 బయ్యర్ కంపెనీ సమీపంలో బ్రిడ్జి పైన భారీ అగ్రి ప్రమాదానికి గురై పూర్తిగా ధ్వంసం అయింది. అనంతరం అగ్నిమాపక కేంద్రం వారు ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.