కారు, ఆర్టీసీ బస్సు ఢీ
బెలూన్ తెరుచుకోవడంతో తప్పిన పెను ప్రమాదం
తాండూరు,(విజయక్రాంతి): ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొనడంతో ఒకరికి గాయాలు అయినా ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి వద్ద సోమవారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ రమేష్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్ వైపు నుండిTS 08 FT1095 నెంబరు గల కారు, తాండూర్ వైపు నుండి హైదరాబాద్ వెళుతున్న TG,34 Z0074 నెంబరు గల ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వేగంగా వస్తూ ఢీకొన్నాయి. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న బెలూన్ ఓపెన్ కావడంతో కారు యజమాని హంజేత్ కు స్వల్ప గాయాలు అయ్యాయి .వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ లో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు.




