18 July, 2026 | 1:47 AM

ఆగస్టులో వస్తున్న కింగ్ జాకీ క్వీన్

18-07-2026 01:36 AM

‘దసరా’, ’ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్‌శెట్టి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కేజేక్యూ జాకీ క్వీన్’. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కేకే గత ఏడాది కన్నుమూశారు. ఆయన సినిమాపై ఉన్న పాషన్, విజన్‌కు నివాళిగా నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇందులో దీక్షిత్ శెట్టికి జోడీగా నూతన నటి శశి ఓదెల పరిచయం అవుతున్నారు.

యుక్తి తరేజా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మేకర్స్ పంచుకున్న రిలీజ్ డేట్ పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నాగేశ్ బనెల్; సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి; ఎడిటర్: శ్రవణ్ కటికనేని; ప్రొడక్షన్ డిజైన్: శ్రీకాంత్ రామిశెట్టి.