జనగణనపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): జనగణన–2027పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించే విధంగా ప్రచార వాహనం ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలెక్టరేట్ ప్రాంగణంలో జనగణన–2027 ప్రచార వాహనాన్ని అదనపు ఎస్పీ రాజేష్ మీనా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన–2027పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించే విధంగా ప్రచార వాహనం ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు సరైన సమాచారం నమోదు ప్రాధాన్యతపై వివరించాలని తెలిపారు. ప్రజలు జనగణన ప్రక్రియలో చురుకుగా పాల్గొని ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని, దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు మరియు అభివృద్ధి ప్రణాళికలకు ఉపయోగపడుతుందని అన్నారు. అధికారులు ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి జనగణన–2027ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. డి ఆర్ డి ఓ ఉమాదేవి, ఏవో భాను ప్రకాష్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.






