గరిడేపల్లి ఎస్ఐగా శ్రీకాంత్ గౌడ్
13-05-2026 08:18 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి ఎస్ఐగా బత్తిని శ్రీకాంత్ గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని ఆత్మకూరు ఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా పనిచేస్తున్న శ్రీకాంత్ గౌడ్ బదిలీపై గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ చలికంటి నరేష్ హుజూర్నగర్ కు బదిలీపై వెళ్లారు.






