రూ.8 వేల కోట్ల ఫీజులు చెల్లించాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
31న రాష్ట్రవ్యాప్తంగా తరగతుల బహిష్కరణ
కలెక్టరేట్, ఆర్డీవో, ఎంఆర్వో ఆఫీసుల ముట్టడికి పిలుపు
ముషీరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు జూలై 31న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి, అన్ని జిల్లాల్లో కలెక్ట రేట్లు, ఆర్డీవో, ఎంఆర్వో కార్యాలయాలను ముట్టడించి అధికారులకు వినతిపత్రాలు అందజేస్తారని ప్రకటించారు.
ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఏర్పాటు చే సిన మీడియా సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చే స్తోందని ఆరోపించారు. సమావేశంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, జాతీయ కన్వీనర్ సి. రాజేందర్, నాయకులు పాల్గొన్నారు.






