27 July, 2026 | 2:13 AM

విక్రమ్-1 రాకెట్ రూపకర్త నిఖిల్ మద్దూరికి ఘన సన్మానం

27-07-2026 12:23 AM

షాద్‌నగర్, జులై 26 (విజయక్రాంతి) భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చారిత్రక విజయం సాధించిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ’విక్రమ్-1’ రాకెట్ నిర్మాణంలో షాద్నగర్కు చెందిన యువ ఏరోస్పేస్ శాస్త్రవేత్త నిఖిల్ మద్దూరి కీలక పాత్ర పోషించారు. విక్రమ్-1 మిషన్ కంప్యూటర్కు సంబంధించిన నావిగేషన్ సాఫ్ట్వేర్ను, రాకెట్ వేగం, పొజిషన్ను అంచనా వేసే జీఎన్సీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఆయన ప్రతిభ కనబరిచారు.

ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్, జర్మనీ-స్వీడన్లలో స్పేస్మాస్టర్ డబుల్ మాస్టర్స్ పూర్తిచేసిన నిఖిల్, గతంలో ఏడీఏ  లో ఎల్సీఏ తేజస్ ప్రాజెక్టులోనూ సేవలందించారు. తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన నిఖిల్ మద్దూరిని ఆదివారం షాద్నగర్లో జాతీయ బీసీ సేన నాయకులు శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్, నాయకులు సుప్ప ప్రకాష్, ప్యాట జయ శ్రీకాంత్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.