15 April, 2026 | 4:35 AM

ముచ్చటగా ముగ్గురు.. పొంగులేటి ఇంట సందడి!

15-04-2026 12:31 AM

ఖమ్మం, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసం మంగళవారం ఆత్మీయ కలయికకు వేదికైంది. మంత్రి ఆహ్వానం మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన గృహానికి విచ్చేశారు.

ముఖ్య నేతలందరూ ఒకే చోట చేరి తేనీటి విందును ఆస్వాదిస్తూ సరదాగా పిచ్చాపాటిగా ముచ్చటించారు. ఎంతో హుషారుగా, ఆప్యాయంగా సాగిన ఈ భేటీలో ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనా రాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.