2 July, 2026 | 1:17 AM

మంచి చేయాలని మనసులో ఉండాలి

02-07-2026 12:17 AM

ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే విద్యా వాలంటీర్లు 

ఎంపిక ప్రక్రియకు విశేష స్పందన 

మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్ 

మహబూబ్ నగర్ టౌన్ జూలై 1: అది చేస్తాం ఇది చేస్తామంటూ మాయమాటలు చెప్పే రోజులకు కాలం చెల్లిందంటూ మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్నారు.

పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన కరువు ఉండకూడదని సంకల్పంతో సొంత డబ్బులు ఖర్చు చేసి విద్య వాలంటీర్లను నియమించి ప్రత్యేక విద్యాబోధన బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది పబ్లిక్ పరీక్షలతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో ఎమ్మెల్యే సహకారంతో ఏర్పాటైన శిక్షణ కేంద్రాలలో విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడంతో ఈ ఏడాది కూడా యధావిధిగా విద్యా వాలంటీర్లతో ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేయించేందుకు చర్యలు తీసుకున్నారు.

బుధవారం ఈ మేరకు విద్యా వాలంటీర్ల ఎంపిక ప్రక్రియకు 430 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాసినట్లు వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్,  మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్ తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సంకల్పంతోనే శ్రీకారం చుట్టిన విధానాలకు ఎమ్మెల్యే ఎక్కడ తగ్గకుండా యధావిధిగా నాణ్యమైన విద్య అందిస్తే భవిష్యత్తు తరాలు ఎంతో బాగుపడతాయ సంకల్పంతో అడుగులు వేస్తున్నారని నిర్వాహకులు ప్రత్యేకంగా పేర్కొన్నారు.