మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రమిది
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ ‘సమ్మర్ హాలిడేస్’. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ రోహ న్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాలోని ‘క్రష్’ అనే పాట ఆవిష్కరణ కార్యక్ర మం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ఈ సాంగ్‌ను లాంఛ్ చేశారు.
ఈ సం దర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్ చూసినప్పుడు ఆనందబాష్పాలు వచ్చాయి. మంచి మూవీ చేశారనిపిం చింది. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు.బాలనటుడు రోహన్ రాయ్ మాట్లాడుతూ.. ‘ఈ సాంగ్, ఈ మూవీ అందరికీ మంచి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుం ది” అన్నాడు. బాలనటి ఖుషి మాట్లాడుతూ.. “-క్రష్ సాంగ్‌ను బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశా రు సింజిత్.
అందరికీ ఈ పాట చాలా బాగా నచ్చుతుంది” అని చెప్పింది. చిత్ర దర్శకుడు శ్రీకర్ మాట్లాడుతూ.. “మా టీమ్ అంతా కలిసి ఈ పాటను అందంగా డిజైన్ చేశాం. ఈపాట ను ఎలా లూబ్‌లో వింటారో, మా సినిమాను కూడా అలాగే రిపీటెడ్‌గా చూస్తారు” అన్నారు. ‘ఒక మంచి మూవీ చేశామని అందరితో అనిపించుకుంటాం’ అని నిర్మాత ధీరజ్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులు, చిత్రబృందం కూడా మాట్లాడారు.






