6 July, 2026 | 4:19 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

23-04-2026 01:26 AM

కామారెడ్డి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులను బస్టాండ్లలో నిలిపివేశారు. పోలీస్ ల సహకారంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సులను డిపోల నుంచి తీసి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికుల అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్నాయి. కామారెడ్డి బస్టాండ్ తో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిలిచిపోయాయి. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై తంటాలు పడుతూ ప్రయాణం చేస్తున్నారు.

డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండడంతో ఇబ్బందుల మధ్య పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం బస్టాండ్లలో తిష్ట వేసి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు వేచి చూసి బస్సులు నడవయని గుర్తించి ప్రైవేట్ వాహనాలపై వెళుతున్నారు.