చర్యలు వద్దు
కీలక తీర్పు
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌కు ఊరట
ఆ కమిషన్ చట్టబద్ధమే అయినా విచారణ ప్రక్రియలో సహజ
న్యాయసూత్రాలను విస్మరించారన్న హైకోర్టు ధర్మాసనం
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవ కలపై విచారణకు ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఆదేశించి వారికి ఊరట కల్పించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలూ పాటించలేదని కోర్టు పేర్కొంది.
బరాజ్‌ల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ 20 24 మార్చి 14న ప్రభుత్వం జారీచేసిన జీవో 6 ను సవాలుచేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్‌కే జోషీలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొ హియుద్దీన్‌ల ధర్మాసనం సుదీర్ఘ విచారణ జ రిపి తీర్పునిచ్చింది.
కేసీఆర్, హరీశ్‌రావుతోపా టు స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషీలకు కూడా కోర్టు ఊరట కల్పించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని న్యాయస్థానం తెలిపింది. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అ ప్పటి ప్రభుత్వ పెద్దలు.. సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్ర భుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణ ప్రక్రియలో సహజ న్యాయసూత్రాలను విస్మరించారని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగిందని కోర్టు అభిప్రాయపడింది.
ము ఖ్యం గా విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం బాధ్యులకు నోటీసులు ఇచ్చి వా రి వివరణ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియను సరిగ్గా అనుసరించలేదని పిటిషనర్లు చే సిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 6ను సమర్థించిన హైకోర్టు.. జీవో 6ను ఆధారంగా ఏర్పాటైన కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియా ముందుకు తీసుకురావడాన్ని తప్పుబట్టింది.
కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు తెలిపారు. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫు న్యా యవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిష న్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు.
ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కా బట్టి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనుందన్న అంశం ఇ ప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాళేశ్వరం కేసును సీబీఐ విచారించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండుసార్లు లేఖ రాసింది.
తాజాగా స్పందించిన సీబీఐ.. కాళేశ్వరం అక్రమాలకు సంబంధించి రాష్ట్ర పోలీ సులు ఏమైనాకేసు నమోదు చేశారా అని అడగడం.. ఇక్క డ ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, మీరే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వి చారణ చేపట్టాలని ప్రభుత్వం రెండో లేఖలో కోరడం గమనార్హం. పిటిషన్లపై ఏప్రిల్ 8న వాదనలు ముగియగా తీర్పును హైకోర్టు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.
హైకోర్టు తీర్పుతో ఊరట: అడ్వకేట్ గండ్రమోహన్‌రావు
కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతో కేసీఆర్‌కు ఊరట లభించిందని మాజీ సీఎం అడ్వకేట్ గండ్రమోహన్‌రావు తెలిపారు. హైకోర్టు తీర్పు తో కమిషన్ రిపోర్టును చెత్తలో పడేయవచ్చన్నారు. సెక్షన్ 8 కింద విచారణ జరగలేదని చె ప్పారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును హై కోర్టు సమర్థించిందన్నారు. కమిషన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తు చేయరాదని న్యాయస్థానం చెప్పిందని ఆయన వెల్లడించారు.






