6 July, 2026 | 4:59 PM

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య

06-07-2026 04:11 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య యూపీఎస్ పాఠశాల కు నర్సరీ నుండి 7వ తరగతి వరకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉందని,  కానీ ఈ విద్యా సంవత్సరంలో  8వ, 9వ, 10వ తరగతులు నడుపుటకు ప్రభుత్వ అనుమతి పొందకుండానే  8వ , 9వ, 10వ తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వచ్చింది.ప్రభుత్వ అనుమతి లేకుండా ఉన్నత తరగతులను నిర్వహించడం విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధం.

కాబట్టి అట్టి తరగతి గదులను సోమవారం సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య  సీజ్ చేశారు, సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాల మరియు మున్సిపాలిటీ పరిధిలోని  తల్లిదండ్రులు తమ పిల్లలను అటువంటి అనుమతి లేని తరగతుల్లో చేర్పించకుండా, ప్రభుత్వ  పాఠశాలల్లో  (లేదా ) ప్రభుత్వ అమోదం పొందిన పాఠశాలల్లో మాత్రమే చేర్పించాలని ఎంఈఓ రాజయ్య తెలిపారు,