6 July, 2026 | 4:58 PM

సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు

06-07-2026 03:59 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 40 వ వర్ధంతి సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో డా.బీఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులుర్పించారు.