ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ
06-07-2026 03:52 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం ధర్మారం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం సర్పంచ్ మిర్యాల్కార్ బాలాజీ, వార్డు సభ్యులు కీసరి కావేరి, నీరటి పరుశురాములు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు.పిల్లలకు అందుతున్న విద్య, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పొట్లపెల్లి గోపాల్ రావు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.






