ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి
బోధన్,(విజయక్రాంతి): ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకుల ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అలాగే వర్షాకాలం ప్రారంభం అవడంతో విద్యార్థులకు అనారోగ్య బారిన పడకుండా సరైన చర్యలు తీసుకోవాలని బోధన్ ఆర్డీవో ని కోరారు. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ హాస్టల్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో నైట్ టైం లో వార్డెన్ వాచ్మెన్ లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని కోరారు.
గతంలో బోధన్ పట్టణ కేంద్రంలో ఒక ప్రభుత్వ హాస్టల్లో వార్డెన్ అలాగే వాచ్మెన్ లేని సందర్భంలో విద్యార్థులు వాగ్వాదం పెట్టుకొని జరిగిన గొడవలో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా సంబంధిత సిబ్బందికి రాత్రి వేళలో సిబ్బంది అందుబాటులో ఉండాలని కోరడం జరిగింది. సంబంధిత అధికారులు ప్రతి నెలకొకసారి తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగింది.






