23 April, 2026 | 2:52 AM

హనుమాన్ దీక్షా పరులకు అన్నప్రసాద వితరణ

23-04-2026 01:26 AM

ముకరంపుర, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కరీంనగర్ లోని ప్రశాంత్ నగర్ కాలనీలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములకు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మరియు కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీక్షా స్వాములకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో అంజన్ కుమార్ 26వ డివిజన్ కార్పొరేటర్, సరిల్ల ప్రసాద్ మాజీ కార్పొరేటర్, ప్రసన్నాంజనేయ స్వామి సేవా సమితి సభ్యులు, కాలనీ వాసులు మరియు పెద్ద సంఖ్యలో హనుమాన్ దీక్షా స్వాములు పాల్గొన్నారు.