29 June, 2026 | 12:58 AM

మౌంట్ కియా గేర్‌ను అధిరోహించిన బన్నీ

29-06-2026 12:08 AM

గురుకుల విద్యార్థి ఘనతపై పలువురి హర్షం

కామారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి): లడక్‌లోని చాకు దాగ్ పీఠభూమిలో ఉన్న 6100 మీటర్ల ఎత్తున ప్రసిద్ధ మౌంట్ కియా గీర్ శిఖరాన్ని ప్రముఖ పర్వతా రోహకుడు విస్లావత్ బన్నీ విజయవంతంగా అధిరోహించాడు. కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ గిరిజన గురుకుల కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీ జూన్ 14న పర్వతం ఎక్కడ ప్రారంభించాడు. జూన్ 19న ఉదయం పర్వతాన్ని అధిరోహించాడు.

అత్యంత ప్రతికూల వాతావరణం మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటూ  ఈ సాహస యాత్రను పూర్తి చేశాడు. పర్వతరోహణలో మరో మైలురాయిని విస్లావత్ బన్ని నెలకొల్పాడని పలువురు హర్షం వ్యక్తం చేశారు. తన ఎదుగుదలకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తిమ్మయ్య సుభాష్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించాడు. విస్లావత్ బన్నీ సాధించిన విజయాన్ని పలువురు అభినందిస్తూ సాహసోపేత ప్రయాణం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.