29 June, 2026 | 1:47 AM

వీహెచ్‌కు పలువురి పరామర్శ

29-06-2026 12:55 AM

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావును ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలితో పాటు పార్టీకి చెందిన వివిధ జిల్లాల నాయకులు పరామర్శించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వీహెచ్ ఖైరతాబాద్‌లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉన్న వీహెచ్‌కు సోమవారం డాక్లర్లు సర్జరీ చేయనున్నారు.