29 June, 2026 | 1:55 AM

స్టోక్స్ రిటర్మైంట్

29-06-2026 12:55 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

నాటింగ్‌హామ్, జూన్ 28: ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణ యం తీసుకున్నాడు. అది కూడా న్యూజిలాం డ్‌తో చివరి టెస్ట్ మధ్యలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.

డ్రెస్సింగ్ రూమ్ లో సహచరులను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ స్పీచ్ లోనే స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. కెప్టెన్‌గా ఇంగ్లాండ్ తరపున తాను ఆడే చివరి మ్యాచ్, చివరి రెండు రోజులు ఇవే అంటూ ప్రకటించాడు. తన రిటైర్మెంట్ వె నుక అసలు కారణాలు త్వరలో వెల్లడిస్తానని స్టోక్స్ చెప్పాడు. 35 ఏళ్ళ స్టోక్స్ 2011 లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.