28 August, 2026 | 5:26 AM

జీవో నెంబర్ 97 రద్దు చేయాలి

28-08-2026 01:28 AM

లక్ష పోస్టు కార్డుల సంతకాల సేకరణతో బీఆర్‌ఎస్‌వీ నిరసన

నల్లగొండ టౌన్, ఆగస్టు 27: జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో గురువారం లక్ష పోస్టు కార్డుల సంతకాల సేకరణ చేపట్టారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్, చల్లా కోటేష్ యాదవ్ లు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని, ఇప్పుడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను మోసం చేసేలా శక్తి స్కీం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి విద్యార్థుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో కలిపే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, గతంలో ఉన్నట్లే ప్రభుత్వ కళా శాలలుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి జీ వో రద్దు అయ్యే వరకు పోరాడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుంటిగొర్ల లింగయ్య యాదవ్, నోముల క్రాంతి, గౌతమ్ కుమార్, సందీప్, శంకర్, వెంకన్న, సై దులు, గౌతమి, స్వప్న, శ్రావణి, శ్వేతా, గీత, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.