రైతుల సమస్యలపై ఏఓకి వినతి చేసిన బీఆర్ఎస్
03-08-2026 08:53 PM
జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రైతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యవసాయ పనులు సాగేందుకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులను తగినంత నిల్వ ఉంచి, సబ్సిడీ ఎరువులను సకాలంలో పంపిణీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల వ్యవసాయ అధికారి (AO)కి సోమ వారం వినతిపత్రం అందజేశారు.
ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ట్రాక్టర్లు ఉన్న రైతులకు వ్యవసాయ ఇంప్లిమెంట్లను సబ్సిడీపై అందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి రైతుకూ అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.






