30 August, 2026 | 12:05 AM

కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి

29-08-2026 10:07 PM

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

భూత్పూర్: కాంగ్రెస్ వెయ్యి  రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సమరభేరి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా భూత్పూర్ మండల పరిధిలోని అన్న సాగర్ గ్రామంలో దేవరకద్ర నియోజకవర్గంలో ని అన్ని మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. శనివారం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన, 420 హామీల మోసాలపై చేపట్టబోయే నిరసన కార్యక్రమాల గురించి పార్టీ శ్రేణులకు,నాయకులకు ఆయన  దిశా నిర్దేశం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సమన్వయంతో పనిచేసి నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలతో మమేకమైతూ కాంగ్రెస్ పార్టీ మోసాలు, పాలన వైఫల్యాల గురించి ప్రజల్లో చర్చ జరిగే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు  విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.