30 August, 2026 | 12:35 AM

సిద్దిపేట కబడ్డీకి జాతీయ స్థాయి ఘనత

29-08-2026 11:30 PM

- జాతీయ స్థాయి రెఫరీగా నరేంద్ర బాబు 

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కోచ్ అంగడి నరేంద్ర బాబు జాతీయ స్థాయి కబడ్డీ రెఫరీ అర్హత సాధించారు. అమేచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి రెఫరీ పరీక్షలో ఆయన అర్హత సాధించడం పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌సీ సంతోష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్ నరేంద్ర బాబును అభినందించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన చిల్లీ మహేష్, రమ్య జాతీయ స్థాయి రెఫరీలుగా అర్హత సాధించగా, తాజాగా నరేంద్ర బాబు కూడా ఆ జాబితాలో చేరడం జిల్లాకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కోశాధికారి సత్యం, ఉపాధ్యక్షుడు రాజు, జాయింట్ సెక్రటరీలు మహేష్, కరుణాకర్, సభ్యులు, క్రీడాకారులు పాల్గొని అభినందనలు తెలిపారు.