30 August, 2026 | 12:41 AM

జెన్-జీపై ముద్రలు కాదు.. ఉద్యోగాలు కావాలి

30-08-2026 12:04 AM

ఆదిభట్ల  ఆగస్టు 29 (విజయక్రాంతి ):  ఆదిభట్ల సర్కిల్  తుర్కయంజాల్ లోని అరుణా కన్వెన్షన్ హాల్లో ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా 3వ మహాసభలు ఘనంగా నిర్వహించారు.మహాసభలకు ముందు యువజన ప్రదర్శన చేపట్టి విద్య, వైద్యం, ఉపాధి హక్కుల కోసం నినాదాలు చేశారు.

ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర యువత సమస్యలపై ప్రభుత్వాలను నిలదీశారు. పేపర్ లీకులు, పరీక్షల రద్దు, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, నిరుద్యోగంపై ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.యువతను దిమాగీ నక్సల్స్గా ముద్ర వేయడం మోదీ అసహనానికి నిదర్శనమన్నారు.

ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్ ఖాళీ పోస్టులను భర్తీ చేసి నియామకాలు వేగవంతం చేయాలని కోరారు. సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య యువతలో శాస్త్రీయ ఆలోచన, సామాజిక చైతన్యం పెంపొందించాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఓరుగంటి యాదయ్య, పానుగంటి పర్వతాలు,

సామిడి శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు తగిలి మధు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి పి. శివకుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వంశీ వర్ధన్రెడ్డి పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ నాయకులు వెంకటేష్, అరుణ్గౌడ్, వీరేష్, మధుకర్, శివరాల సూర్యం తదితరులతో పాటు 100 మంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.