30 August, 2026 | 12:42 AM

స్వదేశీ మ్యాచ్‌లకు స్పాన్సర్ల కరవు

30-08-2026 12:00 AM

2 వారాలు ముగిసినా రాని స్పష్టత

పలు కంపెనీలతో బీసీసీఐ చర్చలు

బేస్ ప్రైస్ తగ్గిస్తుందా ?

ముంబై, ఆగస్టు 29: ప్రపంచ క్రికెట్‌లో ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐతో ఒప్పందాల కోసం, భారత్ జట్టు స్పాన్సర్ షిప్ కోసం ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులతో ఇప్పుడు స్పాన్సర్ షిప్ ఇచ్చేందుకు కంపెనీలు మునుపటిలా ఎగబడడం లేదు. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి.

తాజాగా టీమిండియా స్వదేశ ంతో అదే మ్యాచ్‌లకు స్పాన్సర్ల కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించగా అనుకున్న స్థాయి లో స్పందన రాలేదు. బిడ్ల దాఖలుకు గడు వు ఆగస్టు 13తో ముగిసినా.. ఇప్పటివరకు బోర్డు కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయలేదు. ప్రస్తుతం పలువురు సంస్థలతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గూగు ల్ జెమినీ, స్పిన్నీ, ఎస్బీఐ లైఫ్ వంటి సంస్థల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రెండు వారాలు గడిచినా కొత్త స్పాన్సర్‌పై స్పష్టత రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రస్తుతం టీమిండియా స్వదేశీ మ్యాచ్‌ల టైటిల్ హక్కులు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వద్ద ఉన్నాయి. ఒక్కో మ్యాచ్‌కు ఆ సంస్థ బీసీసీఐకి రూ.4.2 కోట్లు చెల్లిస్తోంది. అయితే కొత్త బిడ్డింగ్‌లో బీసీసీఐ కనీస ధరను రూ.4.75 కోట్లుగా నిర్ణయించింది. ఈ పెరిగిన బేస్ ప్రైస్ కారణంగానే సంస్థలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోం ది. కొత్త ఒప్పందం రెండేళ్ల పాటు.. అంటే 2028 మార్చి 31 వరకు కొనసాగనుంది. గతంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మూడేళ్ల ఒప్పందాన్ని దక్కించుకుంది.

తాజా ఒప్పందం ప్రకారం సుమారు 35 మ్యాచ్లకు టైటిల్ స్పాన్సర్ హక్కులు లభిస్తాయి. దీనిలో 10 టెస్టులు, 12 వన్డేలు, 13 టీ20లున్నాయి. బిడ్డర్‌కు గత మూడు ఆడిట్ చేసిన ఆర్థిక సంవత్సరాల్లో సగటు టర్నోవర్ కనీసం రూ.100 కోట్లు ఉండాలి. లేదా అదే కాలానికి సగటు నికర విలువ కనీసం రూ.100 కోట్లు ఉండాలని బీసీసీఐ నిబంధనల్లో పేర్కొంది. ఈ నిబంధనలు, పెరిగిన బేస్ ప్రైస్ కారణంగా బీసీసీఐకి కొత్త టైటిల్ స్పాన్సర్ ను ఖరారు చేయడం ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.