ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనంతో బీఆర్‌ఎస్ నిరసన
బెజ్జంకి, ఆగస్టు 16: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడాన్ని నిరసిస్తూ ఆదివారం బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న సంక్షేమ పథకాల అమలుకు ఆటంకాలు కలగడం బాధాకరమన్నారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు ఇతర సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు అండగా నిలిచిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని, అర్హులైన లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ , పార్టీ మాజీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,మాజీ ఎంపీటీసీలు లింగాల లక్ష్మణ్, తిరుపతి రెడ్డి.బండి రమేష్, కచ్చు రాజయ్య, కనగండ్ల తిరుపతి,దేవయ్య,దీటి బల్నార్స్,ఎలా శేఖర్ బాబు, వంగల నరేష్,దుమాల మహేష్, నరసింహ రెడ్డి, వెంకటేశ్, శివ, బాబు తదితరులు పాల్గొన్నారు.






