తెలంగాణ నేపథ్యంలో 2కె లవర్స్
ఎంబీ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై రాజేశ్ నాయుడు దర్శకత్వలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న చిత్రం ‘2కె లవర్స్’. ‘సోల్ ఆఫ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో మోహిత్ పెడాడ, శ్రుతి శంకర్, సాయికుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్‌రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, సూర్య, శివన్నారాయణ, ఆమని ముఖ్యపాత్రలను పోషించబోతున్నారు. ఈ సినిమాకు రసూల్ భాయ్ కథను అందించారు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సంగీత దర్శకుడు మణిశర్మ, తనికెళ్ల భరణి, వీఎన్ ఆదిత్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వీఎన్ ఆదిత్య క్లాప్ కొట్టగా, మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి స్క్రిప్ట్ అందజేశారు. హీరో మోహిత్ మాట్లాడుతూ.. ‘ఇదొక కొత్త ప్రేమ కథ. రెగ్యులర్ సినిమాల్లా మాత్రం ఉండదు’ అని అన్నారు. హీరోయిన్ శ్రుతి శంకర్ మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే ఏడ్చేశాను. మా సినిమాలో ఎమోషన్‌తోపాటు కామెడీ కూడా కావాల్సినంత ఉంటుంది’ అని తెలిపింది.
దర్శకుడు రాజేశ్ నాయుడు మాట్లాడుతూ.. ‘తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథతోపాటు ఎమోషన్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఆద్యంతం వినోదభరితంగా మూవీ ఉంటుంది’ అని తెలిపారు. నిర్మాత బిచ్చు నాయక్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ యాసలో ఇదివరకు చూడని ప్రేమకథ, థియేటర్ నుంచి ఇంటికి వెళ్లినా వెంటాడేలా ఉంటుందీ కథ’ అని చెప్పారు.
‘మా చిత్రంలో ప్రేమ, రోదన, ఆవేదన, బంధాలు, అనుబంధాలు, హాస్యం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి’ అని రచయిత రసూల్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ; డీవోపీ: పవన్; రచయిత: రసూల్;






