17 August, 2026 | 2:33 AM

పేరుకు పోతున్న దరఖాస్తులు

17-08-2026 12:37 AM
  1. ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం
  2. నేటి నుండి ఎంపిడిఓ కార్యాలయాల్లో స్వీకరణ 

కరీంనగర్, ఆగస్టు16 (విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రజావాణి ఫి ర్యాదులు బుట్టదాఖలు అవుతున్నాయనే వి మర్శలు తీవ్రంగా ఉన్నాయి. బాధితులు ఇ స్తున్న దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సరైన విచారణ జ రగక సమస్యలు పరిష్కారానికి నోచుకోవ డం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో ప్రజావాణి నిర్వ హణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజల సమస్యల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు ’ప్రజావాణి’ కార్యక్రమాన్ని మం డల స్థాయికి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అ ధికారి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమా నికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. తహసీల్దార్, ఎంపీఓ, మండల వ్యవ సాయ అధికారి, ఎంఈఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి, పోలీస్, ఇతర మండల స్థాయి శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వెంటనే చర్యలు చేపట్టవలసి ఉంటుంది. 

ప్రతి ఫిర్యాదు ప్రజావాణి పోర్టల్‌లో నమోదు...

మండల స్థాయిలో వచ్చే ప్రతి ఫిర్యాదును ఏకీకృత ’ప్రజావాణి పోర్టల్’లో న మోదు చేసి, ఫిర్యాదుదారునికి గ్రీవెన్స్ ఐడీ తో కూడిన రసీదును అందిస్తారు. వికలాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు, బాలిం తలకు ఆర్జీల సమర్పణలో మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మంచినీరు, కూర్చోవడానికి సీటింగ్, హెల్ప్డెస్క్ వంటి ప్రాథమిక సౌకర్యాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ప్రజా సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు అధికారులు ఫి ర్యాదులు తీసుకోవడం వరకే బాధ్యతగా భా విస్తున్నారు తప్ప వాటిపై తదుపరి చర్యలు శూన్యమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, భూసంబంధిత సమ స్యలు, వివిధ శాఖలకు సంబంధించిన అర్జీ లు పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతున్నాయి.

ప్రజావాణికి పలు శాఖల అధికారులు సరిగ్గా హాజరుకావడం లేదనే విమర్శలున్నాయి. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లు అధికారులను పదే పదే ఆదేశిస్తున్నారు. స్థానిక స్థా యిలో సేవలు ప్రజలకు మరింత చేరువ చే సేందుకు ప్రజావాణి నిర్వహణలో మార్పు లు తెస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికయినా మార్పు వస్తుందా చూడాలి.

ఇది ఒక ఉదాహరణ 

ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం, అధికారులు ప్రకటిస్తున్నపటికీ, క్షేత్రస్థాయిలో అమలు మాత్రం అంతంతగానే ఉంది. జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన అవినీ తి అక్రమాలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం తీరునే అందుకు ఉదాహరణ.

మనకొండూర్ మండలం జగ్గయ్యపల్లె కు చెందిన వేల్పుల ఎల్లయ్య గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తు న్నాడు. ఆయన తన సమస్యపై మే నెల 18 వ తేదీన జిల్లా ప్రజావాణిలో అధికారులను నేరుగా కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ అతనికి ఎటువంటి న్యాయం ఈరోజు వరకు జరగలేదగ్గు పైగా మధ్యాహ్నం రెండుగంటల వరకు ప్రజావాణి జరిగే ఆడిటోరియం బయట వేచి ఉన్నప్పటికీ.. ఫిర్యాదు పోర్టల్ లో తన సమస్యను నమోదు చేయలేదని తనకు రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.