29 May, 2026 | 11:44 PM

బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలి

29-05-2026 11:34 AM

బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ 

ఎల్లారెడ్డి, మే 29, (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే సురేందర్  ఫామ్ వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 న శనివారం నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారని ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలా మాజీ ఎమ్మెల్యే లు రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి అలాగే మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షుడు దాఫేదార్ రాజు హాజరు కానున్నారని ఈ సమావేశం ఎల్లారెడ్డి నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే సురేందర్  అధ్యక్షణ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు సమావేశంలో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింలు శ్రవణ్ ఎరుకల సాయిలు పాల్దే నారాయణ చర్ల దేవదాస్ మహేందర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.