గుండెపోటుతో బీఆర్ఎస్ కౌన్సిలర్ మృతి
29-05-2026 11:53 AM
రాజన్న సిరిసిల్ల:29మే (విజయక్రాంతి): సిరిసిల్ల 27వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మ (60) శుక్రవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందింది. గత పది రోజుల కిందట అస్వస్థతకు గురి కాగా ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.






