13 May, 2026 | 2:10 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

చార్జీల మోత.. బస్సు ఎక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

07-10-2025 09:49 AM

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల(RTC fare hike) పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్‌(Bharat Rashtra Samithi) పార్టీ ఆందోళన చేపట్టింది. మంగళవారం నాడు ఆర్టీసీ బస్సు ఎక్కిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినట్టే ఇచ్చి పురుషుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. 

చార్జీల భారం ప్రయాణికులపై ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్(Nampally Exhibition Ground) నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ నిరసన తెలిపారు. చార్జీల పెంపుపై ప్రయాణికులు తమ నిరసన వ్యక్తం చేశారు. పేదలపై నెలకు ఐదు వందల రూపాయల దాకా అదనపు భారం పడుతుందని ప్రయాణికులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి ప్రయాణికులు నినాదాలు చేశారు.