calender_icon.png 11 February, 2026 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ జెండా ఎగరాలని ప్రత్యేక పూజలు

11-02-2026 03:51:25 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపల్లో బిఆర్ఎస్ జండా ఎకరాలని నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు,నాయకులు స్టార్ క్యాంప్నర్ మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు ఎల్లారెడ్డి మున్సిపల్లో 12 కౌన్సిలర్లు బిఆర్ఎస్ జండా ఎగరవేసి ఎల్లారెడ్డి మున్సిపల్ గడ్డపై బిఆర్ఎస్  జెండా ఎగిరేలా కరుణించాలని రేణుక ఎల్లమ్మ మాతకు ప్రత్యేక పూజలు చేసి వేడుకున్నారు.

ఎల్లారెడ్డి మున్సిపల్లో బిఆర్ఎస్ జండా ఎగురుతనే ఎల్లారెడ్డి అభివృద్ధి చెందుతుందని లేదంటే పూర్తిగా వెనుకబడి పోతుందని ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు అన్నారు. ఎల్లారెడ్డి అభివృద్ధి చెందిందంటే ఆది కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఎల్లారెడ్డి మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతే ఎల్లారెడ్డి మరింత వెనుకబడిన ప్రాంతంగా చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.