calender_icon.png 11 February, 2026 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

11-02-2026 03:53:56 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని బంబార గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామస్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, పరిసరాల పరిశుభ్రతలో భాగంగా గ్రామంలోని మూడో అవార్డులో పెరుక్కుపోయిన పిచ్చి మొక్కల తొలగింపు మరియు మురుగు కాలువ పూడికతీత పనులను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బెండారే కృష్ణాజీ, ఉప సర్పంచ్ జాడే సంతోష్, గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మయ్యలు హాజరై పనులను స్వయంగా పర్యవేక్షించారు.

సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామమంతా పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. రహదారులకు ఇరువైపులా ఉన్న పొదలును తొలగించడం ద్వారా దోమల నివారణతో పాటు ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్చలు తీసుకుం టున్నట్లు పేర్కొన్నారు. కార్యదర్శి ధర్మయ్య మాట్లాడుతూ... పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ పడకుండా పనులు కొనసాగిస్తున్నామని, ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, పాల్గొని పారిశుద్ధ పనులను వేగవంతం చేశారు.