11-02-2026 03:48:22 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి జరిపారు. పోలీసుల విచక్షణరహిత దాడిలో పలువురికి గాయాలైనాయి 6గురు బీజేపీ కార్యకర్తల చేతులకు గాయాలు కావడంతో పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండి పడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బి ఆర్ ఎస్ నేతలు 58 డివిజన్ లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని తాము చెబుతుంటే పోలీసులు తమపై లాఠీఛార్జి చేయడం ఏంటని మండిపడ్డారు.