బీఆర్‌ఎస్ నేతలవి రెండు నాల్కల ధోరణి
26-05-2026 01:57 AM
పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్
హైదరాబాద్, మే 25 (విజయ క్రాంతి): సమగ్ర విద్యుత్ సరఫరా పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరడంపై బీఆర్‌ఎస్ నాయకులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ 2017 జనవరి 4న ఇదే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంతో ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నదన్నారు. ఈ ఒప్పందం చేసుకోలేదని బీఆర్‌ఎస్ నాయకులు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నపుడు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టి, అధికారం పోగానే అహంకారంతో మాట్లాడటం బీఆర్‌ఎస్ నాయకులకు అలవాటైందన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు.






