15 June, 2026 | 7:00 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

బీఆర్‌ఎస్ గూటికి వాణి, రమేశ్

30-10-2025 12:34 AM

మణికొండ, అక్టోబర్ 29, (విజయక్రాంతి) : మణికొండ రాజకీయా ల్లో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మణికొండ పంచాయతీ మాజీ వార్డు సభ్యురాలు సముద్రాల వాణి, ముత్తారం గ్రామ మాజీ సర్పంచ్ సముద్రాల రమేశ్ బీఆర్‌ఎస్ లో చేరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలనా దక్షత, కేటీఆర్ పనితీరుకు ఆకర్షితులై, వారిని ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్టు వారు తెలిపారు.

స్థానికంగా పట్లొల్ల కార్తీక్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అభ్యుదయ భావాలు గల సామాజిక సేవకుడిగా రమేశ్కు, మాజీ ప్రజాప్రతినిధిగా వాణికి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరూ బీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరించిన విషయాన్ని పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఒక ప్రకటనలో తెలియజేశారు. వీరి చేరికతో మణికొండలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.