మోతెలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
27-04-2026 06:46 PM
మోతె,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మోతె మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శీలం సైదులు ఆధ్వర్యంలో పార్టీ 26 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను శీలం సైదులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు మాట్లాడుతూ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు , కార్యకర్తలకు పిలుపునిచ్చారు.






