7 July, 2026 | 8:05 PM

Breaking News

పీఆర్టీయూతోనే సమస్యలు పరిష్కారం   •   గిరిజన తండాల్లో ఘనంగా సీత్ల భవాని పండుగ వేడుకలు   •   మందకృష్ణ బాటలో పునరంకితం అవుదాం   •   ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి   •   రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన   •   రోడ్డు భద్రత, ఆటో రిక్షాలో ప్రయాణం, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన   •   మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం   •   జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి   •   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 06:49 PM

గజ్వేల్:  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్ కర్ పద్మ భాయ్ నర్సింగ రావు ఆధ్వర్యంలో  బిఆర్ఎస్ జెండా ఎగరేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి స్వీట్లు పంచుకుంటూ అమరవీరుల త్యాగాలతో సాధించిన రాష్ట్రంలో  పార్టీ పోషించిన పాత్రను,  సాధించిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. మాట్లాడుతూ... 26వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమర వీరుల త్యాగాలతో సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించినది బీఆర్ఎస్ పార్టీయేనని తెలిపారు. అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు.