27 April, 2026 | 2:42 PM

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 12:46 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గులాబీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్రను నాయకులు స్మరించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా గులాబీ జెండా నిలిచిందని, రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్, సునార్కర్ పాపయ్య, దుర్గం శంకర్, పోతిరెడ్డి, దుర్గం వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.