ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు
కేకు కోస్తున్న మండల బిజెపి నాయకులు
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ (55)వ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా క్రాంతి మాట్లాడుతూ సామాన్య కార్యకర్త నుండి కరీంనగర్ కార్పొరేటర్ గా, రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా, కేంద్రమంత్రిగా పదవులు అలంకరించి బిజెపి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసిన గొప్ప బహుజన నాయకుడన్నారు. ముక్కు సూటిగా మాట్లాడే దమ్మున్న నాయకుడు,హిందూ ధర్మ పరిరక్షకుడు మన బండి సంజయ్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో కలకాలం జీవించాలని సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కేక్ కోసి అందరికీ పంచిపెట్టారు.






