11 July, 2026 | 7:11 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

ఎస్‌ఐఆర్ ఫారాలు వెంటనే సమర్పించాలి

11-07-2026 05:54 PM

మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ 

మొయినాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌వోలకు లేదా వార్డు కార్యాలయాల్లో వెంటనే సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ సూచించారు. జిల్లా కలెక్టర్ (ఈఆర్‌ఓ) ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఆన్‌లైన్ ప్రక్రియ జూలై 12న కూడా యథావిధిగా కొనసాగనున్నట్లు తెలిపారు.

ఇంటింటికి వచ్చే బీఎల్‌వోలకు ఫారాలను అందజేయడం లేదా వార్డు కార్యాలయంలో సమర్పించడం ద్వారా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. గడువు సమీపిస్తున్నందున ఫారాలను సరైన వివరాలతో నిర్ణీత సమయంలో సమర్పించని పక్షంలో ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, తద్వారా ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.