27 April, 2026 | 2:42 PM

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

27-04-2026 12:40 PM

36 వ డివిజన్ లో ఘనంగా బీఆర్ఎస్  ఆవిర్భావం సంబరాలు

ఖమ్మం ఏప్రిల్ 27(విజయ క్రాంతి): ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ 36వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పసుమర్తి రాం మోహన్ రావు ఆధ్వర్యంలో సోమవారం  టిఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పసుమర్తి రాం మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజుఅని అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవేసిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. అని ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా జెండా ఆవిష్కరణ అనంతరము సుమారు రెండు వందల మంది ప్రజలకు పులిహోర దద్దోజనం పెట్టడం జరిగిందిఈ కార్యక్రమంలో 36వ బి.ఆర్.ఎస్ డివిజన్ సెక్రెటరీ పిల్లుట్ల కృష్ణ,సట్టు గోపిక, సర్టు మధు, వేనిగల్ల భాస్కర్, తాళ్లూరి శైలజ వెలి శాలఅశ్విని, తాళ్లూరి ధనలక్ష్మి ఏ ఉష ఎం రాజేశ్వరి గొట్టపు లక్ష్మి బి రజిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు