బాన్సువాడ జామ మసీద్ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం
11-07-2026 08:01 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ (తంజీముల్ మసాజిద్) జామ మసీద్ కమిటీ నూతన అధ్యక్షులుగా సయ్యద్ రిజ్వాన్ ఏకగ్రీవంగా ఎన్నికైన శుభ సందర్భంగా బాన్సువాడ పట్టణ మైనారిటీ షాదీఖానా చైర్మన్ అబ్దుల్ వహాబ్, పట్టణ మైనారిటీ సెక్రెటరీ యండి. దావూద్, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ మాజీద్ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.






