11 July, 2026 | 9:12 PM

ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన

11-07-2026 08:11 PM

భూపాలపల్లి,(విజయక్రాంతి): ఈనెల 13  సోమవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతోపాటు  తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు  రాంచందర్ రావు ఎంపీలు ఈటల రాజేందర్ రఘునందన్ రావు నగేష్, ధర్మపురి అరవింద్ లతో పాటు ఎమ్మెల్సీలు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. సోమవారం మధ్యాహ్నం భూపాలపల్లి జిల్లాకు కిషన్ రెడ్డి మొదట పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం గణపురం మండలంలోని కేటీకే 8వ గనిలో కార్మికులతో ముఖాముఖి కానున్నారు.