మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లె సర్పంచ్ మలిశెట్టి శోభన్ తన తొలి వేతనం అందగానే ప్రాథమిక పాఠశాలకు పదివేల రూపాయల విలువైన చార్జింగ్ సౌండ్ సిస్టం మండల విద్యాశాఖ అధికారి వెన్నం వెంకట్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఎవరికైనా జీవితంలో మొదటి వేతనం ఎంతో ప్రత్యేకమైనది, అది కేవలం సంపాదన మాత్రమే కాదు, మన కృషికి లభించిన తొలి ఫలితం అలాంటి విలువైన వేతనాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడం శోభన్ గొప్ప మనసుకు నిదర్శనం అని తెలిపాడు. చార్జింగ్ సౌండ్ బాక్స్ ద్వారా విద్యార్థులకు సులభంగా తెలుగు ఆంగ్లము పద్యాలను బోధించవచ్చని తెలిపారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు.






