27 April, 2026 | 2:31 PM

రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి

27-04-2026 12:39 PM

సదాశివనగర్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): వజ్జపల్లి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా  జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం  గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బిఆర్ఎస్ కార్యకర్తలు వజ్జపల్లి  నుండి ఉత్నూర్ రోడ్డును పరిశీలించారు.రోడ్డుకు మట్టిని పోసి మధ్యలోనే వదిలేశారని, స్థానిక ఎమ్మెల్యే శిలపాలకం వేసి 10 నెలలు గడుస్తున్న పనులు ముందుకు సాగుతాలేవని ఆరోపించారు.మళ్లీ వర్షాకాలం రానుండడంతో ప్రజలకు ఇబ్బంది గా ఉంటుందని వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పనులు తొందరగా ప్రారంభించకపోతే వారం రోజులలో ధర్నా చేయడం జరుగుతుందని,రోడ్డు అయ్యేవరకు వదిలి పెట్టేది లేదు అని బిఆర్ఎస్ కార్యకర్తలు అన్నారు.