బెజ్జంకిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు
11-07-2026 07:55 PM
బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బండి సంజయ్ దేశాభివృద్ధి, ప్రజాసేవలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన సేవలను ప్రశంసించారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి, మరిన్ని సేవలు చేసే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు, నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






