27 April, 2026 | 4:22 PM

భిక్కనూర్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

27-04-2026 12:30 PM

భిక్కనూర్, ఏప్రిల్ 27:(విజయ క్రాంతి): భిక్కనూర్ మండల చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, మిఠాయిల పంపిణీ చేశారు. పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో మండల, గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.