27 April, 2026 | 3:32 PM

Breaking News

మండు వేసవిలో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ   •   స్వీయ జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి   •   ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన నియోజకవర్గ ఇన్చార్జి.   •   తల సేమియా.. చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావాలి   •   తెలంగాణలో కొత్త పార్టీకి ఏం పని— సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు   •   అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.!   •   కన్నతండ్రి కన్నీటి ఆవేదన.. దారి తప్పిన కొడుకు— బైక్ తగలబెట్టిన తండ్రి   •   తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. భారీగా బౌన్సర్ల మోహరింపు   •   కోనరావుపేటలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •  

25 ఏళ్లలో BRS అరుదైన ఘనత: కేటీఆర్

27-04-2026 12:17 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ(BRS Party Formation Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఎగురవేశారు. టీఆర్ఎస్(Telangana Rashtra Sena) పార్టీ ఆవిర్భావం సందర్భంగా కవిత బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి కేటీఆర్ నిరాకరించారు. బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... 25 ఏళ్లలో బీఆర్ఎస్ అరుదైన ఘనత సాధించిందని పేర్కొన్నారు.

బోధించు.. సమీకరించు.. పోరాడు అన్న నినాదంతో ముందుకెళ్లామని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సూచించారు. తెలంగాణలో పదేళ్ల పాటు అద్భుతమైన పాలన అందించామని తెలిపారు. రెండున్నరేళ్లుగా పేదల పక్షాన పోరాడుతున్నామని వివరించారు. తిరిగి కేసీఆర్ ను సీఎం చేయడమే బీఆర్ఎస్ సైనికుల లక్ష్యమని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ అగ్రభాగాన నిలిపారని కేటీఆర్ వెల్లడించారు. 25 ఏళ్లుగా జెండా మోసిన కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.